Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టి20 వరల్డ్ కప్.. టీమ్ ఇండియాతో మ్యాచ్ పై పాక్ యూటర్న్?!
posted on: Feb 8, 2026 7:55AM

పాకిస్థాన్ దిగివచ్చింది. టి20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడాల్సిన మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాక్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. మ్యాచ్ బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎరుర్కొనాల్సి ఉంటుందన్న ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించినందుకు నిరసనగా, ఆ దేశానికి సంఘీభావం తెలుపుతూ టోర్నీలో భాగంగా ఈ నెల 15న భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పీసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ఆడకపోతే ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను పీసీబీ నుంచి భారీ నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేస్తామని హెచ్చరించింది. మరో వైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ నిర్ణయంపై పాక్ పునరాలోచనలో పడింది. బహిష్కరణ వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్న భయంతోనే పాక్ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా టి20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాక్ నిర్ణయం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బహిష్కరణ విషయంలో పునరాలోచనలో పడిందనీ, మ్యాచ్ ఆడే అవకాశాలను పరిశీలిస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు.


.webp)
.webp)


