గుజ‌రాత్ లో ఆప‌రేష‌న్ డెల్టా హంట్.. రాజ‌కీయ కోణ‌మేంటి?

posted on: Jun 9, 2026 2:19PM

గుజరాత్ పోలీసులు- 2026 జూన్ లో..  ఆపరేషన్ డెల్టా హంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన 48-గంటల క్రాక్‌డౌన్‌లో 501 బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేశారు. మొత్తం 6,200 మంది స‌స్పెక్ట్స్ పై దర్యాప్తు జరుగుతోంది. వీరిలో ఎక్కువమంది.. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భరూచ్ నగరాల్లో మాన్యువల్ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఇది గుజరాత్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో వలసదారులను అరెస్టు చేసిన కార్యక్రమం. 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు 4,096.7 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ సరిహద్దు పశ్చిమ బెంగాల్, అసాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల వెంబడి వెళ్తుంది. 1947లో భారత్ విభజన తర్వాత, 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా.. వలసలు కొనసాగుతున్నాయి.  ఒక‌ అంచనా ప్రకారం, భారత్‌లో 15–20 మిలియన్ల  ఇల్లీగ‌ల్ బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది హిందువులు, ముస్లింలు ఉన్నారు. 2019లో CAA- సిటిజ‌న్షిప్ అమైండ్మెంట్ యాక్ట్ అమలైన తర్వాత, హిందువులకు పౌరసత్వం పొందే అవకాశం ఉంది, కానీ ముస్లింలకు లేదు. ఇది వలసలను రాజకీయంగా మరింత క్లిష్ట‌త‌రం చేసింది. 

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 3వేల‌ కిలోమీటర్ల పొడవుకు ఫెన్సింగ్ ఉంది, కానీ చిన్న చిన్న మార్గాల ద్వారా ఇంకా వలసలు జరుగుతున్నాయి. 

ఇక సంఘటనల కాలక్రమం చూస్తే, 2025–2026 విష‌యానికి వ‌స్తే- 2025 ఏప్రిల్ లో గుజరాత్ పోలీసులు 550 మంది బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ చండాలో లేక్ ప్రాంతంలో 457 మందిని అరెస్టు చేశారు. 2025 ఏప్రిల్ 28న‌ హోం మంత్రి హర్ష్ సంగ్‌వి వెయ్యి కంటే ఎక్కువ- బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశార‌ని ప్రకటించారు. డిమోలిషన్ డ్రైవ్ ప్రారంభించారు. 
 
2026 జూన్ 2న‌ గుజరాత్ పోలీసులు 362 మంది బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశారు, 780 మంది అనుమానితుల‌పై దర్యాప్తు ప్రారంభించారు. 2026 జూన్ 3-4 తేదీల్లో ఆపరేషన్ డెల్టా హంట్.. 48-గంటల క్రాక్‌డౌన్‌లో 501 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేశారు. 

2026 జూన్ 4న‌ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్‌వి  6,200 మంది స‌స్పెక్ట్స్ పై దర్యాప్తు జరుగుతోంద‌ని ప్రకటించారు. వీరిలో 362 మందిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు.  2025 ఏప్రిల్ నుంచి 2026 జూన్ వరకు గుజరాత్‌లో 1,500+ మంది బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశారు. ఇది గుజరాత్ చరిత్రలోనే అత్యధికం. 

విదేశీ చ‌ట్టం- 1946 ప్ర‌కారం రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లీగ‌ల్ గా ఇక్క‌డ నివసిస్తోన్న‌ విదేశీయులను గుర్తించి, అరెస్టు చేసి, తిరిగి  పంపే  అధికారం ఉంది. సెక్ష‌న్ 3(2)(c) కింద, 2008–2015 మధ్య కాలంలో 40,082 బంగ్లాదేశ్ పౌరులను ఇలాగే వెన‌క్కు పంపారు.

రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ఫారిన్ యాక్ట్- 1939, ఈ చట్టం కింద, విదేశీయులు 180 రోజుల కంటే ఎక్కువ పాటు ఉంటే, FRRO- ఫారిన్ రీజిన‌ల్ రిజిస్ట్రేష‌న్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయాలి. బంగ్లాదేశ్ పౌరులు 14 రోజుల లోపే రిజిస్ట్రేషన్ చేయాలి. 

విదేశీయులు ఇల్లీగ‌ల్ గా ఉంటే, వారిని FRRO, ఫారిన‌ర్స్ ట్రిబ్యున‌ల్స్ ద్వారా దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తారు. లేదా వెళ్ల‌గొట్టేలా చేస్తారు. అసాం‌లో 100 ఫారిన‌ర్స్ ట్రిబ్యున‌ల్స్ ఉన్నాయి. డిపోర్టేష‌న్ ప్రక్రియ  నిరంతరం  జరుగుతోంది. 

2019లో CAA అమలు అయిన తర్వాత, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనలు, పార్సీలు, క్రైస్తవులు బంగ్లాదేశ్ నుంచి వస్తే, 2014 డిసెంబర్ 31లోప‌ల‌ వస్తే, పౌరసత్వం పొందే అవకాశం ఉంది. ముస్లింలకు లేదు. 

ఇక గుజరాత్ పోలీసులు ఫారిన‌ర్స్ యాక్ట్- 1946 కింద అరెస్టు చేశారు. వీరిని డిపోర్టెడ్ చేయడానికి FRRO, ఫారిన‌ర్స్ ట్రిబ్యున‌ల్స్ ప్రక్రియ జరగాలి. 
 
గుజ‌రాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్‌వి  ఇలాంటి వలసదారులను గుర్తించి, డిపోర్ట్ చేయడం మా లక్ష్యమని  ప్రకటించారు. ఇది 2027లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ముందు  స్ట్రాంగ్ ఇమ్మిగ్రేష‌న్ పాల‌సీకి ఒక సంకేతంగా ఉంది. ఇక గుజ‌రాతీ కాంగ్రెస్ ఏమంటుందంటే, వలసదారులను మాన‌వ హ‌క్కుల కోణంలో చూడాల‌ని అంటుంది.. ఈ బ‌హిష్క‌ర‌ణ‌ ప్రక్రియ హ్యూమ‌న్ రైట్స్ కు విరుద్ధంగా ఆరోపిస్తోంది.
 
బంగ్లాదేశ్ నుంచి అధికారిక ప్రకటన లేదు, కానీ బంగ్లాదేశ్ మీడియా మాత్రం భారత్ వలసదారులను మాన‌వ  హ‌క్కుల‌ ఉల్లంఘన చేస్తుంద‌ని ప్రకటించింది. 

ఇక సామాజిక కోణంలో చూస్తే.. వలసదారులు  ఎక్కువమంది మాన్యువల్ లేబర్‌గా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఆధార్ కార్డులు, కొందరు పశ్చిమ బెంగాల్ గ్రామాల నుంచి పొందారు. ఇది వారిని లీగ‌ల్ గా ఇక్క‌డ‌ ఉండేలా చేసింది. 

స్థానికులు ఏమంటారంటే, వలసదారులు, త‌మ‌కు ద‌క్కాల్సిన ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను  లాగేసుకుంటున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్తం  చేస్తున్నారు. అహ్మదాబాద్, సూరత్‌లో స్థానికులు వీరిని  వెన‌క్కు పంపించేయ‌మ‌ని నినాదాలు చేస్తున్నారు. 

భారతీయ మీడియా మాత్రం గుజరాత్ పోలీసులు అత్యధిక సంఖ్యలో వలసదారులను అరెస్టు చేశార‌ని చెబుతోంది. ఇదొక బ‌ల‌మైన జాతీయ వాదంగా  చిత్రీక‌రిస్తోంది. బంగ్లాదేశ్ మీడియా మాత్రం భారత్ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌గా  మార్చి  రాస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టం- 2019 CAAపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలైన‌ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటివి, అలాగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం మొదటి నుంచీ ఇలాంటి ఆరోపణలే చేస్తున్నాయి. ఈ చట్టం ప్రాథమికంగా వివక్షతో కూడుకున్నదని, మతాన్ని ప్రాతిపదికగా మార్చడం ద్వారా భారత రాజ్యాంగంలోని లౌకికత్వ సూత్రాలకు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని అంటున్నాయి.

2027 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బిజెపి తన దశాబ్దాల రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి  కఠినమైన వలస విధానం,  పౌరసత్వ సవరణ చట్టం-CAA  అమలును ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంటోంది.

ఆపరేషన్ డెల్టా హంట్ కేవలం 501 మంది అరెస్టు కాదు. ఇది గుజరాత్‌లో డిటెక్ట్- డిలీట్- డిపోర్ట్ అనే సూత్రీక‌ర‌ణ‌ అమలుకు సంకేతం. 2027 ఎన్నికలకు ముందు, BJP ఈ కార్యక్రమాన్ని జాతీయ భ‌ద్ర‌త  కోసం అంటోంది. కానీ, మానవ హక్కుల సంస్థలు, కాంగ్రెస్ హ్యూమ‌న్ రైట్స్ ఉల్లంఘనగా ఆరోపిస్తున్నాయి. భవిష్యత్తులో, గుజరాత్‌లో ఇంకా ఎక్కువ మంది వలసదారులను అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ బలోపేతం చేయాల‌ని  తెలుస్తోంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...