తమిళనాడులో ప్రజారవాణాకు ఏసీ బస్సులే.. సీఎం విజయ్ ఆదేశం

posted on: Jun 30, 2026 2:32PM

ప్రజారవాణ మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని ఏసీ బస్సులే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఓ సందర్భంలో ప్రభుత్వ ప్రజారవాణా బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్.. ఆ బస్సు ప్రయాణం తరువాత రాష్ట్రంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఆ నిర్ణయం మేరకురాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేసే బస్సులన్నీ ఏపీ సౌకర్యంతో  ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి   తెలిపారు. ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేలా ప్రజారవాణా వ్యవస్థను ఆధునికీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.   రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం చేరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. ఇక నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి కొత్త బస్సులో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలని విజయ్ ఆదేశించారని చెప్పారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...