తెలంగాణలో ఒకే సారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు : ఎంపీ లక్ష్మణ్

posted on: Jan 26, 2026 2:42PM

 

దేశవ్యాప్తంగా జనగణన 6 నెలల్లోనే పూర్తవుతుందని  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. మహిళల రిజర్వేషన్లతోపాటు ఇతర ప్రక్రియ అంతా ఎన్నికలలోపే పూర్తివుతాయన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకే సారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని లక్ష్మణ్ వెల్లడించారు. జనగణన ముగిసిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని, ఈ మొత్తం ప్రక్రియ వచ్చే ఎన్నికల లోపే పూర్తవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనగణన కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాదని, శాస్త్రీయ పద్ధతిలో ఇది జరుగుతుందని లక్ష్మణ్ తెలిపారు. 

దీని ద్వారా నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే జనగణన, పునర్విభజన అత్యంత కీలకమైన దశలని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలవుతుందని స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలంటే జనగణన, పునర్విభజన అత్యంత కీలకమైన దశలని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలవుతుందని స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...