Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోనసీమలో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు యువకులు మృతి.!
posted on: Jul 20, 2026 6:42AM
.webp)
సరదాగా బీచ్ కి వెళ్లిన ఓ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిలింది. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆదివారం పిక్నిక్ గా ఓడలరేవు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ వారు సముద్రస్నానానికి దిగారు. అలల తాకిడికి వారిలో ముగ్గురు సముద్రంలో మునిగి మరణించారు. మృతులను 23 ఏళ్ల అరవింద్, 17 ఏళ్ల శ్రీరామ్, సాయిగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం వేళ సముద్రంలో అలల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగిపోయింది. చూస్తుండగానే సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భారీ అలల తాకిడికి ఈ ముగ్గురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. స్థానికులు, మత్స్యకారులు వెంటే గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తరువాత ముగ్గురి మృతదేహాలూ లభఢ్యమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మరణించిన ముగ్గురూ కూడా హైదరాబాద్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ.. ఇటీవలే వారు కొన్ని రోజుల సెలవుల నిమిత్తం తమ సొంత గ్రామమైన మాచవరానికి వచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు ఇలా కళ్లముందే అనంత వాయువుల్లో కలిసిపోవడంతో మాచవరం గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. . ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
odalarevu beach accident, konaseema drowning incident, three youths drowned in sea, machavaram village tragedy, allavaram mandal beach


.webp)



