వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం
posted on Nov 6, 2025 11:26AM

వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కార్తీక పౌర్ణమి పర్వ దినాన క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారు స్మశాన వాటిక వద్దనిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ క్షుద్ర పూజలు చేశారు.
పసుపు, కుంకుమ, పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలో పెద్ద దీపాన్ని వెలిగించి పెట్టగా అది గురువారం (నబంబర్ 6) ఉదయం కూడా వెలుగుతూనే ఉండటం, ఆ ప్రాంతంలో జంతుబలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం ఇదే మొదటి సారి కాదని స్థానికులు చెబుతున్నారు. ఇటు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.