రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సూచనలు, ప్రతిపాదనలకు ఆహ్వానం.!

posted on: Jul 9, 2026 10:27AM

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చింది.. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండకు బోడి గుండు కొట్టించి మరీ నిర్మించని రుషికొండ ప్యాలెస్ వినియోగం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వైసీపీ సర్కార్ సకల పర్యావరణ నిబంధనలనూ తుంగలోకి తొక్కి మరీ నిర్మించిన ఈ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

గత కొంతకాలంగా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ రుషికొండ ప్యాలెస్ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  కీలకమైన ప్రకటన చేసింది. ఈ  విలాసవంతమైన భవనాలను ఇప్పటివరకు అధికారికంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేసింది.   రుషికొండ ప్యాలెస్,  అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూడో పక్షానికి లీజుకు ఇవ్వకుండా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై న్యాయస్థానంలో  విచారణ సందర్భంగా  ప్రభుత్వ లీజు వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది, ఈ భవనాల వినియోగానికి సంబంధించి ఆసక్తి ఉన్న వివిధ ప్రైవేట్ సంస్థల నుండి ఏపీటీడీసీ ప్రతిపాదనలను ఆహ్వానించిందని చెప్పారు.  అయితే ఆ ప్రతిపాదనలన్నింటినీ మొదట మంత్రివర్గ ఉపసంఘం క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఆ సబ్‌కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు ఎలాంటి కేటాయింపులు జరగవని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది. 

 వైసీపీ  ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ  భవనాల విషయంలో పర్యావరణ నియమాలను, తీరప్రాంత నియంత్రణ మండలి సీఆర్‌జడ్  నిబంధనల   ఉల్లంఘన జరిగిందన్న  ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ..  2021లోనే తెలుగుదేశం   ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ కొండను తవ్వేసి నిర్మించారంటూ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు కూడా జరిగాయి. ఈ వివాదాల నేపథ్యంలో, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తులు వృథా కాకుండా, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏపీటీడీసీ ఈ ఏడాది జూన్ 24న   ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం  మోడల్, ఎకో టూరిజం ప్రాజెక్టులు ,  అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ వెంచర్ల వంటి సృజనాత్మక అంశాలపై నిపుణులు, సంస్థల నుంచి తగిన సూచనలు, ప్రతిపాదనలను ఆహ్వానించింది. 

Rushikonda Buildings, AP Tourism, Visakhapatnam, APTDC Proposals, AP High Court

google-ad-img
    Related Sigment News
    • Loading...