తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ : రామ్మోహన్ నాయుడు

posted on: May 31, 2026 10:07AM

 

లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు..

వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. 

లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి,  సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జూమ్ ద్వారా హాజరయ్యారు.

సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. అన్న ఎన్టీఆర్ గారి జయంతిని పురస్క రించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...