సింగపూర్ లో ఉత్సాహంగా మినీమహానాడు!

posted on: May 28, 2026 1:16PM

 తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక,   నందమూరి తారకరామారావు ( 103వ జయంతి, మినీ మహానాడు వేడుకలను ఎన్నారై టీడీపీ సింగపూర్ విభాగం అత్యంత వైభవంగా నిర్వహించింది. మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ..  అన్న ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతో ప్రవాసాంధ్రులు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత ఎన్ఆర్ఐ టిడిపి నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు సమాజానికి ఎన్టీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతికి ఆయన తెచ్చిన గుర్తింపును ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సభ్యులు కొనియాడారు. 

ఈ వేడుకలో ఎన్ఆర్ఐ టిడిపి సభ్యులు, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడును పురస్కరించుకుని సభ్యులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి, పార్టీ బలోపేతంలో ఎన్నారైల పాత్రపై ఈ సందర్భంగా సభ్యులు చర్చించారు. నిర్వాహకులు మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంలో సింగపూర్ ఎన్నారై టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుంది, మాతృభూమి ప్రగతికి తమ వంతు సహకారం అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. స్వల్ప వ్యవధిలో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎన్ఆర్ఐ టిడిపి సభ్యులందరికీ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...