Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు
posted on: Feb 8, 2026 11:06AM

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు A3గా ఉన్న హీరో మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనని, అటు తర్వాత వస్తానని పోలీసులకు విష్ణు. సమాధానం ఇచ్చారు. ఈ కేసులో వర్సిటీ పీఆర్‌ఓ సతీష్ A-1 సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో A2 గా ఉన్న నటుడు మోహన్ బాబుకు నోటీసులు అందలేదు.
ఇటీవల మోహన్‌బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనల అనంతరం ఎస్ఎఫ్ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మంచు విష్ణుపై కేసు నమోదు కాగా, విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.బాధితుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాల ప్రకారం యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశాల మేరకే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.






