రేవంత్ ను సీఎం, వేం నరేందర్ రెడ్డిని ఎంపీ.. వారెవ్వా.. ఓటుకు నోటు కేసు!

posted on: Mar 6, 2026 9:15AM

2015లో మొద‌లైన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజ‌కీయాల‌నే మ‌లుపు తిప్పిందంటే  అతిశ‌యోక్తి కాదేమో. ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మొద‌లైన ఈ వివాదంలో కీల‌కంగా ఉన్న ఇద్ద‌రు నేత‌ల‌కు గొప్ప ప‌ద‌వుల‌ను కట్టబెట్టింది. ఇది నిజంగా ఒక విచిత్ర‌ రాజ‌కీయ ప‌రిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక వివరాల్లోకి అంటే.. 2015 కి వెళ్తే.. నాడు  తెలంగాణ ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల సమయంలో  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్  స‌న్ కు రూ. 50 ల‌క్ష‌లు ఇస్తూ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి  చిక్కారు. ఆ ఎన్నిక‌ల్లోతెలుగుదేశం అభ్యర్థిగా  నిలిచింది మ‌రెవ‌రో కాదు..  ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో  రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. అప్పట్లో స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ ఉన్న  దృశ్యాలు, ఆడియో టేపులు.. బ్రీఫ్డ్ మీ వంటి పోన్ సంభాషణలు    పెను ప్ర‌కంప‌న‌లు పుట్టించాయి.

ఈ ప్ర‌కంప‌న‌లు ఎంత‌  మేలు చేశాయంటే.. రేవంత్ రెడ్డి ఆ కేసు విష‌యంలో అరెస్టు కాగా.. అది ఆయ‌న‌లో ఎలాగైనా స‌రే కేసీఆర్ పీచ‌మ‌ణ‌చాల‌న్న కృత‌నిశ్చ‌యం వచ్చేలా చేసింది.  దానికి తోడు ఆయ‌న త‌న కుమార్తె వివాహ స‌మ‌యంలో ఈ అరెస్టు కావ‌డంతో ఆ క‌సి రెట్టింపు అయ్యింది.  కేసీఆర్ నీ అంతు నా చేతుల ద్వారానే జ‌రుగుతుంది చూసుకో! అంటూ ఆయ‌న జైలు నుంచి విడుద‌లైన టైంలో చేసిన ప్ర‌సంగాలు, పిడికిలి బిగించి చేసిన‌ సంజ్ఞ‌లు తెలంగాణ  రాజ‌కీయాల్లోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచాయి.  ఆ త‌ర్వాత కాలంలో.. ఆ క‌సీ క్రోధ‌మే రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి  ఎంపీగా, ఆ త‌ర్వాత  సీఎంగా అవ్వడానికి దారి తీసింది.   ఎవ‌రిని ఎమ్మెల్సీ  చేయాల‌ని ఆనాడు రేవంత్  భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా  క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.

ఈ కేసు రేవంత్, వేం  న‌రేంద‌ర్ రెడ్డి.. ఇద్ద‌రినీ ఒక‌రికొక‌రు న‌మ్మక‌మైన స్నేహితులుగా మార్చేసింది. ఇరువురూ త‌మ క‌ష్ట‌న‌ష్టాల్లో పాల్పంచుకున్నారు. ఒక‌రి శ్రేయ‌స్సే మ‌రొక‌రిగా భావించ‌చారు. ఇప్పుడు చూస్తే వారి మ‌ధ్య ఆ గాఢానుబంధం.. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఒక ప్ర‌త్యేక స్నేహ అధ్యాయాన్ని లిఖించింది.  దీంతో పాటు ఈ కేసు ద్వారా జ‌రిగిన మ‌రో  విషయమేంటంటే.. ఏమిటంటే చంద్ర‌బాబు హైద‌రాబాద్  రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉండ‌టానికి హ‌క్కున్నా దాన్ని  వ‌దులుకుని  అమ‌రావ‌తి వెళ్లిపోయారు. అక్క‌డే ఉంటూ ప్ర‌జ‌ల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా మ‌సులుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. 

ఇక్కడ మోర‌ల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే.. చెడు జ‌రిగింద‌ని.. ఇక అక్క‌డితో అయిపోయింద‌ని   భావించ‌కూడ‌దు. ఒక చెడు  మ‌రో మంచికే  అని భావించి  ముంద‌డుగు వేయాలి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...