ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు

posted on: Jan 30, 2026 5:57PM

 

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో క్యూలైన్‌లో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు 9,276కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి నట్లు సమాచారం. 

రేపు నామినేషన్ల స్క్రూటినీ  జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం  అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...