ట్రంప్ నోబెల్ పాట్లు.. మరోసారి అభాసుపాలు
posted on: Feb 6, 2026 3:09PM
.webp)
ప్రపంచంలో 8 యుద్దాలను ఆపానని గొప్పలు చెప్పుకుంటూ నోబెట్ శాంతి బహుమతికి తన కంటే అర్హులు ఎవరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే తనకు తానే డిక్లరేషన్ ఇచ్చుకుంటుంటారు. గత ఏడాది నోబెల్ పీస్ అవార్డు ప్రదానం సమయం నుంచి ఆయన అదే పాటపాడుతున్నారు. అయితే నోబెల్ కమిటీ ట్రంప్‌ను గుర్తించకపోవడంతో మళ్లీ వచ్చ ఏడాది కూడా ఆ పురస్కారం కోసం హడావుడి మొదలుపెట్టారు.
మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు తన ఘనతే అంటూ వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి తన పేరు నామినేట్ చేయాలని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో పోలాండ్ పార్లమెంటకు ప్రతిపాదను పంపారు. అయితే దాన్ని పోలాండ్ స్పీకర్ తిరస్కరించారు.
బలవంతపు రాజకీయాలు, టారిఫ్ బెదిరింపులతో ట్రంప్ అంతర్జాతీయంగా అస్థిరత నెలకొల్పుతారని, ఆయన నోబెల్‌కు అనర్హులని, అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని పోలాండ్ స్పీకర్ ప్రకటించారు. దాన్ని తీవ్రంగా పరిగణించిన యూఎస్ అది ట్రంప్‌ను అవమానించడమే అని, దాని వల్ల రెండుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చిరంచింది. దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పోలాండ్ ప్రధాని మిత్రదేశాలు పరస్పరం గౌరవించుకోవాలి కాని, ఇలా హెచ్చరికలు చేస్తే సహించేది లేదన్నారు.






