విద్యుత్ చార్జీలను పెంచే ప్రశక్తే లేదు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్

posted on: Jun 12, 2026 2:18PM

ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్ల వరకూ విద్యుత్ చార్జీలు పెరగవు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్  చెప్పారు. జగన్ హయాంలో  వరుసగా పెరిగిన  కరెంట్ బిల్లులతో సగటు సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని చేసిన ప్రకటన పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా  ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ  ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని..  ఆ విధ్వంసాన్ని తాము కేవలం ఈ రెండేళ్ల స్వల్ప కాలంలోనే పూర్తిగా సరిదిద్ది, వ్యవస్థను మళ్లీ   పట్టాలెక్కించామని   వివరించారు.

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో  విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదనీ, రాబోయే మూడేళ్లలో కూడా విద్యుత్ చార్జీలను పంచే ప్రశక్తే లేదనీ గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

 జనన్ ఐదేళ్ల  పాలనలో  ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచి, సామాన్య వినియోగదారులపై మోయలేని రీతిలో అదనపు ఆర్థిక భారాన్ని మోపారన్న ఆయన..   గత ప్రభుత్వం వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన  ట్రూ అప్ భేదాలకు తాము శాశ్వతంగా స్వస్తి పలికామని చెప్పారు.

రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తాము  ట్రూ డౌన్ అనే విప్లవాత్మక విధానాన్ని ప్రవేశపెట్టామని గర్వంగా వెల్లడించారు. ఈ  ట్రూ డౌన్ విధానం ద్వారా   యూనిట్‌కు ఏకంగా 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను తగ్గించామని ఆయన  వివరించారు. ఈ అద్భుతమైన నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు  4,498 కోట్ల రూపాయల మేర  ఆర్థిక ఉపశమనం లభించిందని స్పష్టం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...