ఏటీఎంలలో డబ్బులు ఎందుకు ఉండటం లేదు

 

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి..నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఏటీఏంలలో డబ్బు అందుబాటులో ఉండటం లేదు. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే..ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్‌ అన్న మ్యాటరే. ఒక రకంగా పెద్ద నోట్లు రద్దు చేసిన పరిస్థితి కంటే దారుణంగా ఉంది బయట. ఢిల్లీకి చెందిన లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇంతకంటే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. బ్యాంకులు ఏటీఎంలలో నగదు పెట్టకపోవడానికి కొన్ని కారణాలు చెప్పారు సర్వేలో పాల్గొన్న వారు.

 

* కేంద్ర ప్రభుత్వం ప్రజలను బలవంతంగా డిజిటలైజేషన్, ఆన్‌లైన్‌ చెల్లింపుల వైపు నెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 

* దేశంలో 90% మంది నగదు వాడుతుండగా..10% ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతున్నాయి..ఇలా కాకుండా 90 శాతం ఆన్‌లైన్ లావాదేవీలు జరిగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

* ఆన్‌లైన్‌లో రూ.800 కోట్ల లావాదేవీలు జరగ్గా..దీనిని మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో డబ్బులే అందుబాటులో లేకుండా చేస్తోంది..బ్యాంకులకు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ కావడంతో అవి ఏటీఏంలను తగ్గించే పనిలో పడ్డాయి.

 

* బ్యాంకులకు ఆర్బీఐ నుంచి అందుతున్న నగదులోనూ ఇప్పుడు భారీగా కోత పడుతోంది. గతంలో వారానికి పది నుంచి 10 నుంచి 12 సార్లు నగదు సరఫరా చేసే ఆర్బీఐ ప్రస్తుతం 5 సార్లు మాత్రమే సరఫరా చేస్తోంది.

 

* నగరాల్లో ఏటీఎంలను మూసేసి..ఉన్న వాటిలోనూ సరిపడా నగదు ఉంచకుండా..ప్రజలు డిజిటల్ లావాదేవీలు చేయక తప్పని పరిస్థితి కల్పించాలని బ్యాంకులు వ్యూహాలు రచిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu