Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐ.. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ముప్పులేదు!
posted on: Apr 25, 2026 2:49PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక రంగంపై దాని ప్రభావంతో ఉద్యోగాల కోత తప్పదన్న ఆందోళన జనాల్లో పెరుగుతూనే ఉంది. పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే లేఆఫ్స్‌ను ప్రకటించాయి. భవిష్యత్ లో మరింతమందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారన్న వార్తలు ఐటీ ఎంప్లాయీస్‌ను గందరగోళంలోకి, భయాందోళనలలోకీ నెడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ప్రొఫెసర్ మిశ్రా విశ్లేషణ మేరకు.. ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) అని అంటారు. అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా ఇవి కొత్త టెక్స్ట్‌ను రెడీ చేస్తాయి. అంతే. అంటే ఈ-మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్స్‌ను సంక్షిప్త రూపంలో వివరించడం, కంప్యూటర్ కోడ్ రాయడం, వంటి ఇవి అంతకుముందే ఉన్న సమాచారం ఆధారంగా ఇవి పని చేస్తాయి. పాత డేటాలోని సరళి, ధోరణలను గుర్తించి అందుకు అనుగుణంగా యూజర్లు అప్పగించిన పనులను పూర్తి చేస్తాయి. ప్రస్తుత ఎల్ఎల్‌ఎమ్‌లు మనుషుల్లాగా ఆలోచించలేవు. కొత్తగా అవి వేటినీ సృష్టించలేవని మిత్రా అన్నారు. వాటి వద్ద అప్పటికే ఉన్న డేటా ఆధారంగానే అవి పనిచేస్తాయని వివరించారు. కాబట్టి, ఇవి మనుషులకు సహాయకారులుగా మాత్రమే పనిచేయగలవనీ, వారికి ప్రత్యామ్నాయంగా కావని ప్రొఫెసర్ విశాల్ మిశ్రా చెబుతున్నారు.
మనుషుల బాధ్యతలను పూర్తిగా స్వీకరించే సత్తా ప్రస్తుత ఏఐకి లేదన్న ఆయన.. ఏఐ కేవలం మనుషులు చేసే పనుల్ని కాస్త మెరుగుపరుస్తుంది తప్ప స్వతంత్ర నిర్ణయాలు, సృజనాత్మకత అవసరమైన వాస్తవిక ప్రపంచంలో ఎల్ఎల్‌ఎమ్‌లు తడబడతాయని అన్నారు. వైద్యం, ఇంజనీరింగ్, జర్నలిజం వంటి రంగాల్లో అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయా రంగాల నిపుణులేనని స్పష్టం చేశారు. అయితే.. ఎల్ఎల్ఎమ్‌లకు భిన్నమైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐజీ అందుబాటులోకి వస్తే మాత్రం ప్రపంచంలో కొత్త మార్పులు వస్తాయని ప్రొఫెసర్ మిశ్రా అభిప్రా యపడ్డారు మనుషులతో సమానమైన లేదా అంతకు మించిన సామర్థ్యం ఏజీఐకి ఉంటుందన్న ఆయన.. తర్కం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, తనంతట తానే కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి సామర్థ్యాలు ఏఐజీకి ఉంటాయని వివరించారు.
ఫలితంగా ఇవి కొత్త ఐడియాలను సృష్టిం చగలవన్నారు. ఒక కొత్త బిజినెస్ మోడల్‌ను లేదా కొత్త ఉత్పత్తిని డిజైన్ చేసే సత్తా ఈ టెక్‌కు ఉంటుందని వివరించారు. ఈ టెక్నాలజీ ఉనికిలోకి వచ్చాక అసలైన పెనుమార్పులు జరుగుతాయని చెప్పారు. అయితే, ఏజీఐ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నకు ప్రస్తుతం కచ్చితమైన సమాధానం లేదని ఆయన చెప్పారు.






