Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నో హెల్మెట్.. నో ఎంట్రీ.. గద్వాలలో కఠిన ఆంక్షలు
posted on: May 13, 2026 2:45PM

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు భద్రతపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారికి నో హెల్మెట్ – నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అంతే కాకుండా నోహెల్మెట్, నో ఎంట్రీ నిబంధన తక్షణమే అమలులోనికి వచ్చిందని స్పష్టం చేశారు.
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అధికార కార్యాలయాలకు వస్తుంటారు. అయితే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని భావించిన అధికారులు ముందుగా ప్రభుత్వ కార్యాలయాలలో నో హెల్మెట్, నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇకపై హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వచ్చే వారిని కార్యాలయ గేట్ల వద్దనే నిలిపివేస్తారు. హెల్మెట్ ధరించి వచ్చిన వారికి మాత్రమే లోపలికి ప్రవేశం కల్పిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ చర్య ప్రజల ప్రాణ భద్రత కోసం తీసుకు న్నదని, అందరూ సహకరిం చాలని అధికారులు కోరు తున్నారు.ఈ నిర్ణయం రోడ్డు భద్రతపై కొత్త చైతన్యానికి నాంది అవుతుందని అంటున్నారు.



.webp)


