Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇక ఏ దుష్టశక్తీ అమరావతిని అడ్డుకోలేదు.. బాలకృష్ణ
posted on: May 2, 2026 9:41AM
.webp)
అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ భూమిపూజ చేశారు. రాజధాని అమరావతిలో రూ.750 కోట్లతో నిర్మిస్తున్న 1000 పడకల బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
ఈ సందర్భంగా అమరావతి మహిళలు బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ అరాచక పాలనలో తాము పడిన ఇబ్బందులను మహిళలు బాలయ్యకు వివరించారు. బాలకృష్ణ స్పందిస్తూ పార్లమెంటులో చట్టం అయినందున ఇక ఏ దుష్టశక్తి అమరావతి రాజధానిని అడ్డుకోలేదని అన్నారు. మీ త్యాగాల వల్లే ఈరోజు అమరావతి రాజధాని కల సాకారమవుతుందని బాలకృష్ణ కొనియాడారు.






