పాక్ పౌరులకు అనుమతి నో.. సింధు జలాల ఒప్పందం రద్దు!
posted on Apr 24, 2025 12:51PM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది. అందులో బాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సింధు నది జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
అలాగే భారతదేశంలోకి పాకిస్థాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా, ఆ దేశస్థులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది. ఈ మేరకు పాక్ పాక్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశంతోనూ చర్చల ప్రశక్తే లేదని ప్రకటించింది. ఇప్పటికీ పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుంటే ముందుముందు మరిన్ని కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమబని భారత్ హెచ్చరించింది.