Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లల ఆరోగ్యమే లక్ష్యం… గూడూరులో ఐస్‌క్రీం బండ్లకు నో-ఎంట్రీ
posted on: Mar 20, 2026 3:12PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలానికి చెందిన గూడూరు గ్రామ ప్రజలుస్థానిక యువత, చిన్నారుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకొని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గూడూరు గ్రామ పరిధిలోకి ఐస్‌క్రీం బండ్లు రాకుండా పూర్తిగా నిషేధం విధించారు. అంతేకాకుండా గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి గ్రామంలో ముఖ్య కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు... ఐస్ క్రీమ్ అమ్మే ఐస్ క్రీమ్ లు బండ్లు, ఆటోలకు తమ గ్రామంలోకి ప్రవేశం లేదు. ఒకవేళ...ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ₹5,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో గ్రామంలో అనారోగ్య సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని గమనించామని గ్రామ పెద్దలు తెలిపారు. ముఖ్యం గా పిల్లలు ఎక్కువగా ఐస్‌క్రీం తీసుకోవడం వల్ల దంత సమస్యలు, గొంతు ఇన్‌ఫె క్షన్లు, జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని చెప్పారు. అదనం గా, ఐస్‌క్రీం తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై కూడా అనుమా నాలు వ్యక్తమవుతున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐస్‌క్రీం బండ్ల ద్వారా మద్యం కలిపి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేసింది. చిన్నారులను ఆకర్షించే విధంగా ఈ అక్రమ చర్యలు జరుగుతున్నాయన్న అనుమానం రావడంతో గ్రామస్థులు ఐస్ క్రీం వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.ఇప్పటికే గ్రామంలో అక్రమ మద్యం బెల్ట్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుని వాటిని మూసివేయించిన గ్రామ పెద్దలు, ఇప్పుడు ఐస్‌క్రీం బండ్లపై దృష్టి సారించడం గమనార్హం. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని గ్రామ కమిటీ స్పష్టం చేసింది.గ్రామం లోని మహిళా సంఘాలు, యువజన సంఘాలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.
మూడు రోజుల క్రితమే ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రావడం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. అయితే, కొందరు ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఐస్‌క్రీం విక్రేతలు తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందా అనే చర్చ కొనసాగుతోంది.






