ఏపీ ఆర్టీసీలో మళ్లీ మోగిన సమ్మె సైరన్‌

posted on: May 8, 2019 6:01PM

 

ఏపీఎస్‌ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి ప్రధాన కార్మిక సంఘం ఎన్‌ఎంయూ బుధవారం సమ్మె నోటీసు ఇచ్చింది. 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబుకు ఆ సంఘం నేతలు అందజేశారు. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని, సిబ్బంది కుదింపు, గ్రాడ్యుటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. అద్దె బస్సుల పెంపు నిర్ణయాన్ని సైతం ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎన్ఎంయూ నేత శ్రీనివాస్‌రెడ్డి.. ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ. 670 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్టీసీ పరిరక్షణకు కృషిచేయాలని కోరారు. లేకపోతే ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేస్తామని ఎన్‌ఎంయూ హెచ్చరించింది. మరోవైపు, ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు గురువారం సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...