మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా
posted on: Jan 24, 2026 10:19AM

నిజామాబాద్‌లో శివారులో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. కారులో గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎక్సైజ్ సిబ్బందిపై దాడికి పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో తనఖీలు జరుపుతున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిపై గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనల్లో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ గాజుల సౌమ్యాను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం పోలీసులు వాహనాన్ని వెంబడించి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.






