నిజాం ఫండ్స్ మాకే దక్కాలి..

posted on: Jun 23, 2016 5:09PM

 

నిజాం నిధులు తెలంగాణ ప్రభుత్వానికే దక్కాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి షాకిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నిజాం ఫండ్ కు సంబంధించిన కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తోపాటు.. కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి ముందుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అందుకే దీనికి సంబంధించిన ఫైళ్లను అందించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్నికోరింది. అంతేకాదు ఆ ఫైళ్ల కోసం కేంద్రం నుండి పలువురు అధికారులు కూడా హైదరాబాద్ కు వచ్చారు. కానీ ఆఫైళ్లు మాత్రం లభించలేదు.


అయితే కేంద్రం చొరవ తీసుకొవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలు వచ్చాయేమో తెలియదు కానీ.. హైదరాబాద్ ప్రభుత్వం నుండే నిధులు లండన్ వెళ్లాయి కాబట్టి ఈ ఫండ్స్ తిరిగి తెలంగాణ ప్రభుత్వానికే దక్కతాయని.. కేంద్రానికి ఎట్టిపరిస్థితుల్లోనూ దక్కవని తేల్చిచెబుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ  అధికారి మాట్లాడుతూ.. 'రాష్ట్ర విభజన అనంతరం ఆధారాల కోసం భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వెంటపడుతోంది. హైదరాబాద్‌లో ఉన్న ఫైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వెదుకులాట ప్రారంభించింది. అయితే, ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో తెలియదు. ఏదేమైనా నిజాం ప్రభుత్వానికి చెందిన నిధులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి చెందుతాయి' ఆ అధికారి తెలిపారు. మరోవైపు దాదాపు లండన్ ప్రభుత్వం నుండి 350 కోట్లు నిధుల గురించి నిజాం మనవడు నవాబ్‌ నజఫ్‌ అలీ ఖాన్‌ కూడా ప్రయత్నిస్తున్నారు.


అసలు స్టోరీ..

నిజాం సంస్థానంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన నవాజ్‌ జంగ్ 10,07,940 పౌండ్ల తొమ్మిది షిలింగ్‌లను లండన్‌లోని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆ దేశ హైకమిషనర్‌ హెచ్‌ఐ రహీమ్‌తులాకు చెందిన నేషనల్‌ వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంక్‌లోని ఖాతాలో జమ చేశారు. '1947-48లో హైదరాబాద్ ఖాతా నుంచి లండన్‌కు నిధులు బదిలీ అయ్యాయి. 1947, ఆగస్ట్ 15 తర్వాత కూడా హైదరాబాద్ స్వాతంత్ర్య రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకుంది. హైదరాబాద్‌ సంస్థానం అప్పటికే ఉనికిని కోల్పోవడంతో ఖాతాదారు నవాజ్‌ జంగ్‌ అనుమతి లేకుండా ఆ నిధులను వెనక్కు మళ్లించలేమని బ్యాంక్‌ తేల్చి చెప్పింది. అయితే నిజాం ఇప్పుడు స్వతంత్ర పాలకుడు కాడని, ఒకప్పటి హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన ఆ నిధులు తమకు చెందుతాయని భారత్‌ వాదించడంతో కేసులో న్యాయ వివాదం ముదిరింది. ఈ వివాదం 67 ఏళ్లుగా కొనసాగుతూ ఇప్పుడు లండన్‌లోని హైకోర్ట్‌ చాన్స్‌రైలో ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...