బిహార్ సీఎంగా పదోసారి నితీష్ ప్రమాణస్వీకారం
posted on Nov 20, 2025 8:45AM

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ కుమార్ పేరును బీజేపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బిహార్ గవర్నర్కు సమర్పించారు. గురువారం (నవంబర్ 20) ఉదయం పదకొండున్నర గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి. ఈ సారి నితీష్ కుమార్ కేబినెట్ లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 21 మందితో నితీష్ కేబినెట్ కొలువుతీరనుంది.