నితీష్ రాజీడ్రామా: పాట్నా పాలిటిక్స్
posted on: May 19, 2014 12:48PM
.jpg)
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం టీకప్పులో తుఫాను మాదిరిగా సర్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్‌లో జేడీయు బీజేపీ చేతిలో చావుదెబ్బ తినగానే అప్పటి వరకూ ప్రధాని అవ్వాలనే కలలు కన్న నితీష్ కుమార్‌కి ఎక్కడ లేని రోషం పొడుచుకొచ్చింది. దాంతో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశాడు. నితీష్ ఆవేశం చూసిన అందరూ ఇక నితీష్ రాజీనామా వెనక్కి తీసుకోరని అపోహ పడ్డారు. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ తన రాజీనామా వెనక్కి తీసుకుని ఎంచక్కా బీహార్‌ని పరిపాలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. నితీష్ రాజీనామా అంశం మీద జేడీయూ అగ్ర నాయకులు సమావేశమయ్యారు. బీహార్‌ని పరిపాలించడానికి నితీష్‌ని మించిన మొనగాడెవరూ లేరని వాళ్ళందరూ ఫీలయ్యారు. నితీష్‌ని తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. దాంతో నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని నితీష్ కోరారు. అయితే జేడీయు నాయకుడు శరద్ యాదవ్ మాత్రం నితీష్ రాజీనామాకే కట్టుబడి వుంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో జేడీయులో కలకలం రేగింది. చిట్టచివరకి ఈ రాజీనామా డ్రామా ఎలా ముగుస్తుందో చూడాలి.



.jpg)
.jpg)

.webp)



