Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'బాహుబలి'లో నటించిన నితిన్.. ఇదిగో ప్రూఫ్!
posted on: Oct 30, 2023 7:25PM

'బాహుబలి' సినిమాలో హీరోగా ప్రభాస్, విలన్ గా రానా నటించారని తెలుసు. కానీ నితిన్ కూడా నటించాడని తెలుసా?. ఏంటి తెలియదా?.. అయితే 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్' టీజర్ చూడాల్సిందే.
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ ఫిల్మ్ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు. "భయ్యా కథంటే మామూలు కథ కాదు భయ్యా.. రియల్ ఇన్సిడెంట్ ని చూసి రాసుకున్న కథ" అనే వాయిస్ తో 'ఎక్స్ ట్రా' టీజర్ ప్రారంభమైంది. చేజ్, ఫైట్, గన్ ఫైరింగ్ తో నితిన్ ని ఓ రేంజ్ రేంజ్ లో పరిచయం చేసి.. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ అని రివీల్ చేయడం సరదాగా ఉంది. అలాగే "నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావు కదా" అని నితిన్ ని శ్రీలీల అడగటం, "బాహుబలిలో ఆరో లైన్ లో ఏడోవాడు ఎవరో తెలుసా?" అని సంపత్ రాజ్ తో నితిన్ చెప్పిన డైలాగ్ ఫన్నీగా ఉన్నాయి. అంతేకాదు బాహుబలి సీన్ ని తీసుకొని, గ్రాఫిక్స్ లో నితిన్ ని యాడ్ చేసి చూపించడం.. దానిని సంపత్ రాజ్ కి ప్రూఫ్ లాగా నితిన్ చూపించడం భలే ఉంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే ఇదొక మంచి ఎంటర్టైనర్ అనిపిస్తోంది.






