ఏపీతో కలిపి పలు రాష్ట్రాలతో మైనింగ్ మిషన్ : నిర్మలా సీతరామన్
posted on: Feb 1, 2026 11:59AM
.webp)
కేంద్ర బడ్జెట్‌లో ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ భారీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత కోసం ఏపీ, ఒడిశా, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా వెళ్లే మైనింగ్ కారిడార్ను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమం అరుదైన ఖనిజాల గుర్తింపు మరియు వెలికితీతపై దృష్టి సారిస్తుంది. 2025లో ప్రారంభించిన అరుదైన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ పథకానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు.
ఈ కారిడార్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, రక్షణ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఏపీ తీరప్రాంత రాష్ట్రాల్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఈ కారిడార్లు దోహదపడతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో నూతన పరిశ్రమల స్థాపనతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.






