ఏడు హైస్పీడ్ రైళ్లు...హైదరాబాద్‌కు అగ్ర తాంబూలం
posted on: Feb 1, 2026 11:34AM

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. 1. పుణే-హైదరాబాద్, 2. హైదరాబాద్-బెంగళూరు, 3. హైదరాబాద్-చెన్నై, 4. ముంబై-పుణే, 5. బెంగళూరు-చెన్నై, 6. ఢిల్లీ-వారణాసి, 7. వారణాసి-సిలిగురి కారిడార్లను ప్రకటించారు. వారణాసి, పాట్నాలలో షిప్ రిపేర్ కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులను తీసుకు రానున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అందుబాటులోకి రానున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని, సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
సవరించిన పన్ను రిటర్నుల దాఖలు 31 వరకు పొడించారు. విదేశీ యాత్రపై ట్యాక్స్ తగ్గించారు. చదువులు, వైద్యంపై టీడీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కేంద్రం శుభా వార్త చెప్పింది. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం అందించనున్నాట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు
దివ్యాంగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు చేయూతగా నూతన పథకాలు తీసుకొచ్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన అనే స్కీమ్‌లు తీసుకొచ్చినట్లు తెలిపారు. మానసిక వ్యాధుల చికిత్సకు నిమ్స్‌హన్స్ ఏర్పాటు చేస్తామని.. రాంచీ, తేజ్‌పుర్‌లలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో పాటు తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు


.webp)
.webp)


