Latest News

లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

posted on: Feb 1, 2026 10:39AM

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పించారు. అంతకు ముందు బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేంద్ర మంత్రి అందజేశారు. రాష్ట్రపతి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. దేశం చరిత్రలో ఆదివారం రోజున బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో 7 శాతం  వృద్ధి సాధించగలిగామని తెలిపారు. దేశ సెమీ కండక్టర్ రంగం  వృద్ధి కోసం సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0ను ప్రకటించారు. ఇందు కోసం రూ.40 వేల కోట్లు కేటాయించనున్నాట్లు తెలిపారు.

మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ బంగారం ధర ఆదివారం 9 శాతం పతనం అయ్యింది. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.13,711 క్షీణించి రూ.1,38,634కు చేరింది. అంతకుముందు గురువారం ఒక్కరోజే పసిడి ధర రూ.31,617 (17.2 శాతం) మేర పతనమైంది. దీంతో రూ.1,93,096 నుంచి రూ.1,52,345కు చేరింది. అటు వెండి ధరలోనూ పతనం కొనసాగుతోంది. రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతుండడంతో మార్చి కాంట్రాక్ట్‌ వెండి రేటు ఒక్క రోజులోనే రూ.26,273 (9 శాతం) పతనమై రూ.2,65,652కి చేరింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...