నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్ అరెస్టు

posted on: May 8, 2026 8:12AM

 నాసిక్‌  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను నాసిక్ పోలీసులు గురువారం (మే 7) అరెస్టు చేశారు.  గత కొన్ని రోజులుగా  పరారీలో ఉన్న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి నాసిక్ సెషన్స్ కోర్టు ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన   రోజుల వ్యవధిలోనే ఈ అరెస్ట్ జరగింది. తాను గర్భిణీనని..  తనకు ఈ కేసుతో పరిమిత సంబంధం మాత్రమే ఉందని పేర్కొంటూ ఆమె బెయిల్ కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే  కోర్టు ఆమె బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చడంతో   ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎ ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. 

 టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో పనిచేస్తున్న కొందరు మహిళా ఉద్యోగినులను ఇస్లాం మతం స్వీకరించాలని నిదా ఖాన్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హిందూ సంప్రదాయాలను వదిలి ఇస్లామిక్ పద్ధతులను అనుసరించాలని, బుర్కా ధరించాలని ఆమె బాధితులపై ఒత్తిడి తెచ్చారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా..  నిందితులైన ఇతర పురుష ఉద్యోగుల చేత లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారిని అడ్డుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురి పోలీసులు అరెస్ట్ చేశారు. నిదా ఖాన్ అరెస్ట్‌తో మొత్తం అరెస్టైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.   కాగా..  ఈ వివాదంపై గతంలోనే స్పందించిన టీసీఎస్ యాజమాన్యం.. నిదా ఖాన్ తమ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆమెను ఇప్పటికే విధుల్లో నుంచి తొలగించినట్లు  వెల్లడించింది.  నిదా ఖాన్‌ విచారణలో  ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి  వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...