Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయవాడలో ఉగ్ర గుట్టురట్టు.. ఎన్‌ఐఏ మెగా దాడులు.!
posted on: Jul 8, 2026 11:30AM

విజయవాడ నగరంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. బుధవారం (జూలై 8) ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ విస్తృత దాడులు చేపట్టాయి. విజయవాడలోని వించిపేట పరిసర ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లు, వారు నివసించిన రహస్య స్థావరాలపై ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్‌ఐఏకు బదిలీ అయిన ఉగ్రవాద ముఠా లింకుల కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. ఈ సోదాలతో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్ ఖైదా నెట్‌వర్క్‌ల ప్రమాదకరమైన దేశద్రోహ కుట్రల గుట్టు రట్టయింది.
ఈ భారీ నెట్‌వర్క్ విషయంలో.. మొదట ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచి ఛేదించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, 27 ఏళ్ల ఎండీ డానిష్, 23ఏళ్ల మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి 8 రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లను చేర్చారు.
వీరంతా కలిసి అల్-మాలిక్ ఇస్లామిక్ యూత్' అనే ఒక రహస్య గ్రూపుగా ఏర్పడ్డారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. విదేశీ హ్యాండ్లర్ అయిన అల్-హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో వీరంతా భారత్‌లో ఐసిస్, అల్-ఖైదా నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి ప్రణాళికలు వేశారు. నిందితులను విచారించిన అధికారులకు దిగ్భ్రాంతికరమైన కుట్ర కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చడం.. జాతీయ జెండా స్థానంలో ఐసిస్ నల్ల జెండాను ఎగురవేయడం, అలాగే 'గజ్వా-ఎ-హింద్ కోసం పనిచేయడమే తమ ముఖ్య లక్ష్యాలని నిందితులు అంగీకరించారు. ఇందుకోసం వారు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలుగా బెనెక్స్.కామ్ అనే రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు.
ఈ డిజిటల్ గ్రూపులలో కొందరు పాక్ జాతీయులు కూడా సభ్యులుగా చేరి ఉగ్ర కార్యకలాపాలను నడిపించేవారని సమాచారం. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ పేరిట ప్రాణాలర్పించడానికి యువతను బ్రెయిన్ వాష్ చేసి చేర్చుకునేవారు. వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. విదేశీ హ్యాండ్లర్ షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి, వారిని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు పంపి అక్కడ స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీ పేలుడు పదార్థాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి ప్రమాదకరమైన స్కెచ్ వేశారు.
వీరికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్థాన్ లోని సభ్యుల ద్వారా సరిహద్దుల నుండి సరఫరా చేస్తామని షుకూర్ హామీ ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా, సయీదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ ను కూడా ఏర్పాటు చేసి దేశంలో తీవ్రవాదాన్ని మరింత విస్తరించాలని కుట్ర పన్నారు. ప్రశాంతంగా ఉండే నగరాల్లో స్లీపర్ సెల్స్ గా ఉంటూ ఇంతటి భారీ వినాశనానికి ప్లాన్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం నిందితులపై కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం , , ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ISIS Al Qaeda India network, Al Malik Islamic Youth, Vijayawada terror links case, UAPA cases Andhra Pradesh, BENX COM telegram group, Teluguone





