Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐసిస్ అనుబంధ బయోటెర్రర్ కుట్ర కేసులో ముగ్గురిపై ఎన్ఐఏ చార్జిషీటు
posted on: May 6, 2026 8:45AM

పబ్లిక్ ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐసిస్ అనుబంధ బయో టెర్రర్ కుట్ర కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముగ్గురిపై అధికారికంగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అనుబంధం కలిగిన ఈ నిందితులు జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సామూహిక విషప్రయోగం చేసి భయాన్ని వ్యాప్తి చేయాలని కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ కాగా, సహ నిందితులు ఉత్తర ప్రదేశ్ కు చెందినఆజాద్, మొహమ్మద్ సుహేల్ . వీరిపై యూఏపీఏ, బీఎన్ఎస్, ఆర్మ్స్ యాక్ట్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద అహ్మదాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
ఈ కేసును మొదటగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ) నమోదు చేసింది. నవంబర్ 2025లో టోల్ ప్లాజా వద్ద డాక్టర్ మొహియుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతని కారులో అక్రమ ఆయుధాలు, నాలుగు లీటర్ల ఆముదం నూనె లభించాయి. అదే రోజు ఏటీఎస్ మిగతా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసింది.అధికారుల దర్యాప్తులో ఆజాద్, సుహేల్ హనుమాన్ ఘాట్ లోని డెడ్-డ్రాప్ సైట్ నుంచి డబ్బు పార్సిళ్లు, అక్రమ ఆయుధాలు సేకరించి వాటిని గుజరాత్‌లోని ఛత్రాల్ ప్రాంతంలో మొహియుద్దీన్‌కు అందేలా వదిలినట్లు వెల్లడైంది.
జనవరి 2026లో కేసు దర్యాప్తు చేపట్టి5న ఎన్ఐఏ కీలక విషయాలను బయటపెట్టింది. మొహియుద్దీన్‌ను అతని హ్యాండ్లర్ దక్షిణ ఆసియా ప్రాంతానికి ఐఎస్ అమీర్ గా చేస్తామని హామీ ఇచ్చి ఈ కుట్రలోకి దింపినట్లు తెలిసింది. మొహియుద్దీన్ తన హైదరాబాదు నివాసాన్ని ఆముదం విత్తనాల నుంచి రిసిన్ తయారీకి రహస్య ప్రయోగశాలగా మార్చినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో ఇతర ఇద్దరు నిందితుల పాత్ర కూడా కీలకంగా బయటపడింది. వారు విదేశీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు చేసినట్లు ఎన్ఐఏ తేల్చింది.


.webp)
.webp)


