Latest News

రాజమండ్రి కల్తీ పాల ఘటన సుమోటోగా ఎన్ హెచ్ ఆర్ సీ చర్యలు

posted on: Mar 26, 2026 4:34PM

రాజ‌మహేంద్రవరం  క‌ల్తీ పాల ఘటనను  జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్  సీరియ‌స్‌గా తీసుకుంది. దీన్ని సుమోటోగా తీసుకుని, ఏపీ సీఎస్‌, డీజీపీల‌కు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై రెండు వారల్లొగా  నివేదిక ఇవ్వాలంటూ ఎన్ హెచ్ ఆర్ సీ ఆ నోటీసుల్లో ఆదేశించింది. 

రాజ‌మహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా ఇప్పటి వరకూ 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతులలో   పిల్ల‌లు, వృద్ధులు ఉన్నారు. మొద‌ట ఆరుగురు మరణించగా, ఆ త‌ర్వాత ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ మరో పది మంది మరణించారు.  

క‌ల్తీ పాలు తాగి ప‌లువురు మరణించడాన్ని  ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌గా తీసుకుంది. మ‌నుషుల ప్రాణాలు పోయే దుస్థితి రావ‌డానికి కార‌ణాల‌పై ఎన్‌హెచ్ఆర్‌సీ నివేదిక కోరింది.  పాలను నిల్వ చేసే ఫ్రిజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...