Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
posted on: Feb 3, 2026 6:02PM
.webp)
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలతో కడప జిల్లా ఎస్పీ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంపై ఇవాళ జనసేన త్రిసభ్య కమిటీ ఆయన విచారణ చేశారు. మరోవైపు ఇవాళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ వ్యవహారంపై విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అరవ శ్రీధర్‌ను జనసేన అధిష్టానం ఆదేశించింది. తనను చాలా కాలంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే లైంగిక వేధించారని ఓ మహిళ ఆరోపించారు. తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రాట్స్ చెప్పిన తర్వాత నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని అన్నారు. తర్వాత టెలిగ్రామలో చాటింగ్ చేశారని తెలిపారు. కొన్ని రోజులు బాగానే మాట్లాడిన తర్వాత శాసన సభ్యుడి అసలు రంగు బయటపెట్టారని ఆరోపించారు.






