Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ దుబాయ్ లింక్ తో మిస్టరీ
posted on: Apr 15, 2026 3:24PM

మొయినాబాద్‌లో వెలుగుచూసిన ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి అరెస్టుతో మొదలైన ఈ కేసులో, ఇప్పుడు దుబాయ్ కనెక్షన్ బయ టపడటం సంచలనంగా మారింది. విచారణలో భాగంగా పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గత ఏడాది దుబాయ్ లో డ్రగ్స్ ఓవర్‌డోస్‌తో మృతి చెందిన కేదార్ పేరు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది.
రోహిత్ రెడ్డి సోదరులకు కేదార్‌తో సన్నిహిత సంబం ధాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రోహిత్ రెడ్డి , కేదార్ మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు జరిగాయి. డ్రగ్ పార్టీలు నిర్వహించే వ్యక్తులకు పలుమార్లు డబ్బులు పంపినట్లు ఆధారాలు సేకరించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ కీలక అంశాలన్నీ పోలీసులు కస్టడీ పొడిగింపు పిటిషన్‌లో స్పష్టంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒక సాధా రణ డ్రగ్స్ కేసుగా ప్రారంభ మైన ఈ ఘటన, ఇప్పుడు అంతర్జాతీయ లింకులు ఉన్న నెట్‌వర్క్‌గా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


.webp)



