Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పైరసీని అరికట్టేందుకు నూతన వ్యూహం
posted on: Mar 17, 2026 4:46PM

సినీ పరిశ్రమను సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సమాయత్తమైంది. పైరసీని సమూలంగా రూపుమాపేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చింది.
రాష్ట్రంలో సినిమా పైరసీ బెడద నిర్మూలించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోమవారం (మార్చి 16) కీలక సమావేశం నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్ శిఖాగోయెల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్‌పర్సన్ దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పైరసీ కేసుల దర్యాప్తు కోసం కొత్త ప్రామాణిక నిర్వహణ విధానాలను ప్రారంభించారు.
మొత్తంగా చిత్రపరిశ్రమకు పైరసీ పెనుసవాలుగా మారిన సంగతి తెలిసిందే. పైరసీ కారణంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పైరసీ భూతాన్ని అరికట్టడానికి రూపొందించిన విధానాలు పైరసీ కేసుల దర్యాప్తు సమర్థవంతంగా వేగంగా ముందుకు సాగడానికి దోహదం చేస్తాయని శిఖాగోయెల్ తెలిపారు.
సినిమా పైరసీ తీవ్ర నేరమన్న శిఖాగోయెల్.. దీనిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్ పర్సన్ దగ్గుబాటి సురేష్ బాబు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి ధన్యవాదాలు తెలుపుతూ పైరసీ అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు మేలు చేస్తాయన్నారు.
ఈ చర్యకు ధన్యవాదాలు తెలిపారు. ఇది చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. పైరసీని అరికట్టేందుకు అవలంబిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానాల మేరకు సినిమా పైరసీకి సంబంధించిన ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారు. పైరసీ వెబ్‌సైట్‌లను గుర్తించి వాటిని బ్లాక్ చేస్తారు. పైరసీకి పాల్పడే వ్యక్తులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటారు.






