Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వారసత్వ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త మార్గదర్శకాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
posted on: Mar 26, 2026 4:19PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్‌కు చిక్కుముడులు వీడాయి. వారసత్వంగా వచ్చిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అటువంటి స్థలాల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేలా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇకపై ఈ స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. ఆ స్థల యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. వ్యసాయేతర స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ ఇక తప్పని సరి కాదు. స్థలం యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలను అమలు అవుతాయి.
చాలామందికి వారసత్వంగా పూర్వీకుల నుంచి వ్యవసాయేత భూములు వచ్చాయి. అయితే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవసరమైన హక్కుకు సంబంధించి వీరి వద్ద ఆధారాలు లేవు. అంటే క్రయ, విక్రయ హక్కు భుక్తాదులకు సంబంధించి వీరు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి చిక్కులకు పరిష్కారంగా ఇంత వరకూ రెవెన్యూ అధికారుల నుంచి యాజమాన్య పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అయితే రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్ తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఇబ్బందులకు పరిష్కారంగా వివాదాల కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ఆస్తి వారసత్వంగా వచ్చిందనీ, ఇతరులకు హక్కు లేదని, ఈ భూములు నిషేధిత జాబితా లో లేదని కచ్చితంగా డాక్యుమెంట్‌లో స్పష్టంగా ప్రస్తావించాలి. రిజిస్ట్రేషన్ చేయబోయే స్థలానికి పూర్తి హక్కుదారు తామేనని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఆ మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొంది. అలాగే రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ కుటుంబ వివాదాలు, ప్రభుత్వ భూమి అనే అనుమానాలు వస్తే ఆ భూమి రిజిస్ట్రేషన్ నిలిపిసే అధకారం అధికారులకు ఉంటుంది.



.webp)


