తిరుమల శ్రీవారి ఆలయం ముందు కొత్త జంట ఫొటో షూట్.. క్షమాపణలు

posted on: Jan 30, 2026 8:12AM

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక కొత్త జంట జరిపిన ఫోటోషూట్ వివాదాస్పదమైంది. తిరువణ్ణామలైకి చెందిన శ్రీ తిరుమాల్ గాయత్రీ దంపతులు ఇటీవల తిరుమల ఆలయ ప్రాంగణంని  కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. అనంతరం  తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ దంపతులు శ్రీవారి ఆలయం ముందు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. శ్రీవారి ఆలయం ముందు ఆ దంపతుల ఫొటో షూట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ నేపథ్యంలో ఆ జంట..  తమకు టీటీడీ నిబంధనల గురించి తెలియదని..  తెలియక చేసిన తప్పుకు క్షమించాలనీ కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది.  చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవ చేసేందుకు సిద్ధమని పేర్కొంది.  ఇప్పటికే ఆలయం ముందు తాము తీసిన ఫొటోలను పూర్తిగా తొలగించినట్లు ఆ దంపతులు పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...