ఇది కదా విజ్ణత!

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. మిగిలిన సమయంలో రాజకీయ విభేదాలు మరిచి రాష్ట్ర ప్రగతి గురించే ఆలోచించాలి. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెప్పే మాట. ఇప్పుడు ఆయన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన స్వల్ప వ్యవధిలోనే పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దార్శనికత, మంత్రి నారా లోకేష్ చొరవ, కృష్టి, పట్టుదల కారణమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం ఈ మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ఇలా పెట్టుబడులు వెల్లువెత్తడానికి తమ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కారణమని చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ ఘనతా తమదేనని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. 

అభివృద్ధి అన్నది సమష్టిగానే సాధించగలమని ఎప్పుడూ చెబుతూ ఉండే మంత్రి నారా లోకేష్ వైసీపీ క్లెయిములపై స్పందించిన విధానం ఆయనలో పరిణితికి అద్దంపట్టింది.  వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వం  కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను సమర్పిస్తే వాటిని అమలులోకి తీసుకురావడానికి, ఆ ఒప్పందాల క్రెడిట్ వైసీపీకే ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలోనే చెప్పిన లోకేష్ ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసి.. గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో సంప్రదింపులకు  ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

  గత ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న పెట్టుబడిదారులతో ఇప్పటికే సంప్రదించామని చెప్పిన లోకేష్ వారికి అనుకూలమైన, విశ్వసనీయ వాతావరణాన్ని అందించేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు.  ఈ ఒక్కమాటతో రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము రాజకీయ తారతమ్యాలు చూపబోమని చాటారు.  ఇది కదా విజ్ణత అంటే అంటూ  నెటిజనులు పెద్ద ఎత్తున లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తూ, వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu