Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రియల్ లైఫ్ ‘భారతీయుడు’ మన నేతాజీ
posted on: Jan 23, 2026 2:12PM

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 'నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను' అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్'తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటు చేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది.
దేశ స్వాతంత్య్రం కోసి తన జీవితానే త్యాగం చేసిన ఆ మహానాయకుడి జయంతి జనవరి 23. ఆయన జయంతి రోజులను పరాక్రమ్ దివస్ అని పిలుస్తారు. నేతాజీ బ్రిటీషర్ల గుండెల్లో రైళ్ల పరిగెత్తించిన ధీరుడు. శాంతి వల్ల స్వాతంత్ర్యం రాదని.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానని దేశ ప్రజలను రణరంగం పైపు నడిపిన అసలు సిసలు యోధుడు.
స్వాంతత్య్రం కేవలం మాలతో రాదని నమ్మిన నాయకుడు సుభాష్‌చంద్రబోస్. బ్రిటీష్ పాలనను ఎదిరించాలంటే ఆయుధాలతోనే పోరాటం చేయాలన్న సంకల్పం ఆయనది. అదే ఆయన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకుడిగా నిలబెట్టింది. ఇంగ్లాండ్‌లో జరిగిన అత్యంత కఠినమైన ఐసీఎస్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా, బ్రటీష్ ప్రభుత్వానికి మద్దతుగా పని చేయలేనని ఆ ఉద్యోగాన్ని వదిలేసిన త్యాగశీలి ఆయన. స్వామి వివేకానందుని ప్రభావం నేతాజీపై ఎక్కువగా కనిపించేది.
ఆధ్యాత్మికతత పాటు దేశభక్తి కలిసి నడవాలని నమ్మేవారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన నేతాజీ, స్వాతంత్య్రం సాధించే మార్గం విషయంలో ఇతర నాయకులతో విభేదించి కాంగ్రెస్‌ను వీడారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారత్ స్వాతంత్య్రమే ఆయన లక్ష్యంగా కొనసాగింది. జర్మనీ నుంచి ఆజాద్ హింద్ రేడియో ప్రారంభించి భారతీయుల్లో ధైర్యం నింపారు.
ఈ నేపధ్యంలో జైహింత్ అనే నినాదాన్ని నేతాజీ దేశానికి అందించారు. 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి ఆయన చేసిన పోరాటం బ్రిటీష్ పాలనకు పెద్ద సవాల్‌గా నిలిచింది. జపాన్ సాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు నడిపిస్తూ, స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త దశకు తీసుకెళ్లారు.
1945 విమానప్రమాదంలో ఆయన మరణించారని వార్తవచ్చినా.. ఇప్పటికీ చాలా మంది ఆయన బతికే ఉన్నారని నమ్ముతారు. మొత్తానికి సుభాష్‌చంద్రబోస్ జీవితం ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ఆయన ఆలోచనలు, పోరాటం ఈ రోజుకీ యువతను ప్రేరెపిస్తుంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాయకుడు అంటే ఆయనే. రియల్ లైఫ్‌లో అసలు సిసలు ‘భారతీయుడు’ మన నేతాజీ.


.webp)
.webp)


