Latest News
నల్లసూరీడి పుట్టిన రోజు
posted on: Jul 18, 2013 2:07PM
.jpg)
నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా తన 95 వ పుట్టినరోజును ఈ సారి హాస్పిటల్‌లోనే జరుపుకుంటున్నారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట మోదుడి జన్మదినాన్ని దక్షిణాఫ్రికా ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తుంది..
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణం జూన్ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు..
ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్ ప్రైజ్‌న్ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి..
ప్రస్థుతం సీరియస్ కండిషన్‌లో హాస్పిటల్‌లో ఉన్న మండేలా కోసం ఆ దేశ ప్రజలు ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు..


(4).jpg)
.jpg)


