నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధనా కేంద్రం
posted on: Feb 12, 2026 8:15PM

నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ కీలక ఒప్పంద కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలోని దుత్తలూరు మండలంలో రాకెట్ పరిశోధనా కేంద్రం .. స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాకెట్, స్పేస్ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అభివృద్ధి జరగనుంది. గతంలో రాకెట్ పరిశోధన కేంద్రం స్థాపనకు రాచవారిపల్లి, బ్రహ్మశ్వరం రెవెన్యూ పరిధిలోని భూములను నెల్లూరు కలెక్టర్ హిమాన్సు శుక్లా పరిశీలించారు. ఈ రాకెట్ పరిశోధన కేంద్రం స్థాపనతో ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరగనున్నాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభించే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది. పరిశ్రమల స్థాపన ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం లభించనుంది.


.webp)



