క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఇద్దరు అరెస్టు

posted on: Mar 4, 2026 1:23PM

నెల్లూరులో  సాగుతున్న భారీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను బాలాజీ నగర్ పోలీసులు ఛేదించారు.  దుబాయ్‌లో స్పెషల్ ట్రైనింగ్ పొంది మరీ బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన పొడపాటి మహేష్ బాబు, హరి కృష్ణలు ఈ బెట్టింగ్ దందాను నడిపిస్తున్నారు.  ఓ బాధితుడిని నమ్మించి రూ. 53 లక్షలు కాజేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు జరిపిన మెరుపు దాడిలో నిందితుల నుంచి 34.65 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లోని 1.64 కోట్ల  సొమ్మును సీజ్ చేశారు.

అలాగే 13 సెల్ ఫోన్లు, లాప్‌టాప్, మనీ కౌంటింగ్ మెషిన్, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సె కేసులు నమోదు చేసి అదుపులోనికి తీసుకున్నారు. రాధే  ఎక్స్ఛేంజ్ యాప్ (Radhee Exchange App) పేరుతో  నిందితులు ఈ దందా నిర్వహిస్తున్నారు.  బెట్టింగ్ వెబ్‌సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. ఇలా ఉండగా నిందితుల్లో ఒకడైన పొడపాటి మహేశ్‌బాబు గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసే వాడు. సులభంగా సొమ్ము సంపాదించాలన్న అత్యాశతో  బెట్టింగ్‌ యాప్‌ను ఎంచుకున్నట్లు పోలీసులు చెప్పారు.  
 

google-ad-img
    Related Sigment News
    • Loading...