నెల్లూరులో లారీ బీభత్సం..ముగ్గురు స్పాట్ డెడ్

 

నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్,  3 బైక్‌లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  . క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పోలీసులు  సహాయక చర్యలు చేపట్టారు.ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu