Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నీట్ పేపర్ లీక్...సీబీఐ కేసు నమోదు
posted on: May 13, 2026 3:18PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారికంగా కేసు నమోదు చేసింది. భారత ప్రభుత్వ విద్య మంత్రత్వ శాఖపరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ యూజీ 2026 పరీక్షను 03 మే 2026న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినప్పటికీ, పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని పత్రాలు అనధికారికంగా చలామణి అవుతున్నాయని సమాచారం అందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో నేరపూరిత కుట్ర, మోసం, నేరపూరిత విశ్వాస భంగం, దొంగతనం, సాక్ష్యాల ధ్వంసం వంటి తీవ్ర నేరాలతో పాటు అవినీతి నిరోధక చట్టం మరియు ప్రజా పరీక్షల అక్రమ నివారణ చట్టం 2024 కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. పరీక్షా ప్రక్రియ యొక్క పవిత్రతకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపినట్లు అధికారులు చెప్పారు. అవకతవకల స్వభావం, పేపర్ లీక్ పరిధి, సంబంధిత వ్యక్తులు మరియు సంస్థల ప్రమేయాన్ని గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


.webp)



