ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పా : సీఎం చంద్రబాబు
posted on: Feb 1, 2026 4:55PM
.webp)
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. కల్తీ నెయ్యి ఘటనపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే తాను మాట్లాడానని ముఖ్యమంత్రి అన్నారు. అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానన్నారు. దీనిపై వైసీపీ నాయకులు నానాయాగి చేసిన సుప్రీం కోర్టు వెళ్లారని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడి వైసీపీ నేతలు తిరుమలలో మహాపాపం చేశారని, వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని పేర్కొన్నారు.
తప్పు చేయడమే కాకుండా.. ఎదురుదాడి చేయడం శోచనీయమన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో భాగంగానే శ్వామలరావును పంపామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ సమయంలోనే ఆయన ఎన్డీడీబీ నివేదిక అడిగారని, అది వచ్చాకే తానూ స్పందించానని చంద్రబాబు గుర్తు చేశారు. తిరుమలకు తాను సామాన్య భక్తుడిగానే వెళ్లి సేవలు చేస్తానని, ఏనాడూ వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకోలేదని, అదజి తన అలవాటు అని ముఖ్యమంత్రి తెలిపారు. దేవుడిపై నమ్మకం లేకపోతే వదిలేయవచ్చు కానీ.. అపచారం చేయడం మహాపాపంతో సమానమని చంద్రబాబు అన్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ ఇప్పుడు ఏమి మాట్లడాను అని సీఎం అన్నారు



.webp)
.webp)



