హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీపై ఎన్‌సిబి దాడి.. రూ.17కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

posted on: Apr 23, 2026 10:17AM

హైదరాబాద్ నగరంలో మరో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడింది. దేశవ్యాప్తం గా మత్తు పదార్థాలపై కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో  తాజాగా హైదరాబాద్ మౌలాలి ఐడీఏ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న డ్రగ్ తయారీ కేంద్రాన్ని ఛేదించింది. మౌలాలీలోని ఒక రసాయన యూనిట్‌లో అక్రమంగా మత్తు మందులు తయారవుతున్నాయన్నవిశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌సిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు.  ఈ సోదాల్లో రెండు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో భారీగా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 69 వేల 600 కిలోల ఆల్ప్రజోలామ్ స్వాధీనం చేసుకున్నారు.

దానితో పాటు డ్రగ్ తయారీకి అవసరమైన రసాయనాలు, ముఖ్యంగా ఎఫెడ్రిన్ తయారీ ముడి పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్  మార్కెట్ విలువ 17.40 కోట్ల రూపాయిలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరే షన్‌లోఒక కెమిస్ట్,ముడి పదార్థాల సరఫరాదారు, రవాణా నిర్వహించే వ్యక్తిని అరెస్టు చేశారు.  

ఎన్‌సిబి ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వేసవిలో డ్రగ్స్ కు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని కల్లు దుకాణాలకు ఆల్ప్రజోలామ్ సరఫరా చేయాలని కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. అరెస్టైన నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...