Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...NBK 111: బాలయ్యకు విలన్ గా టాలీవుడ్ స్టార్!
posted on: Mar 6, 2026 3:22PM

- 'NBK 111'లో విలన్ గా టాలీవుడ్ హీరో
- బాలయ్యను ఢీ కొట్టబోతున్న యంగ్ స్టార్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందుతోంది. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
'వీరసింహారెడ్డి' తరువాత బాలకృష్ణ-గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు.. బాలయ్య అండర్ వరల్డ్ డాన్ గా కనిపించనున్నాడనే వార్తల నేపథ్యంలో.. 'NBK 111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది.
'NBK 111'లో విలన్ గా మంచు మనోజ్(Manchu Manoj) నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ముందు విలన్ గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలి. అలాంటి సాహసం చేయడానికి మనోజ్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన ముద్ర వేసిన మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గానూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా 'మిరాయ్'లో స్టైలిష్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు 'NBK 111'లోనూ స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని వినికిడి.
కాగా, బాలకృష్ణ-మనోజ్ కలిసి నటించడం అనేది ఇది మొదటిసారి కాదు. 14 ఏళ్ళ క్రితం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' అనే సినిమా చేశారు. అందులో మనోజ్ హీరోగా నటించగా, అతిథి పాత్రలో బాలయ్య కనువిందు చేశారు.
Also Read: మృత్యుంజయ్ మూవీ రివ్యూ






