Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచంలోనే తొలి మహిళగా రాధిక రికార్డు..
posted on: Jul 9, 2016 3:13PM

మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన నేవీ కెప్టెన్ రాధికా మీనన్ కు అత్యంత అరుదైన పురస్కారం దక్కింది. ఐదేళ్ళ క్రితం సముద్రంలో తుఫానులో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులను కాపాడేందుకు.. సముద్రంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకుగాను ఆమెకు 'ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్' పురస్కారం లభించింది. దీంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రాధిక రికార్డు సృష్టించారు.






