సహజసిద్ధ హెర్బల్ ఫార్మా స్యూటికల్.. రిలీఫ్ వెల్నెస్ ఆవిష్కరణ

posted on: Feb 21, 2026 8:55AM

ఆరోగ్యం విషయంలో హెర్బ్స్   ప్రభావమంతంగా  పని చేస్తాయని రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. రిలీఫ్ వెల్నెస్ సంస్థ మార్కెట్ లోకి కొత్తగా ఆయుర్వేద ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసింది. రిలీఫ్ వెల్ఫేర్ కొత్తగా తీసుకువచ్చిన 18 రకాల ఆయుర్వేద ఉత్పత్తులను శుక్రవారం (ఫిబ్రవరి 20) ను ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు వేల ఏళ్ల ఆయుర్వేదజ్ణానాన్ని, ఆధునిక వైద్య శాస్త్రానికి అనుసంధానించలేమా, అలోపతి మెడిసిన్ లా ప్రభావమంతమైన ఆరోగ్యరక్షకు ఉపయోగించాలన్న లక్ష్యంతో  తొమ్మిదేళ్ల పరిశోధనలు చేసి స్మాల్ మాలిక్యూల్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వాస్తవానికి సహజసిద్ధ ఉత్పత్తుల్లోనే ఆరోగ్యం దాగుందని ఆయన అన్నారు. తాము తీసుకువచ్చిన ఈ టెక్నాలజీ ఆయుర్వేదం, ఫార్మాస్యుటికల్ సైన్స్ మధ్య అంతరాన్ని తాము తీసుకువచ్చిన ఉత్పత్తులు ఫిల్ చేస్తాయని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని ఈ తరహా ఔషధాలు రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు మురళీమోహన్ అన్నారు. ఇక ఈ ఉత్పత్తులను ఆవిష్కరించిన నటి కాజోల్ మాట్లాడుతూ ఈ తరహా విజ్ణానం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.   ప్రస్తుతానికి తాము తీసుకువచ్చిన ఈ ఉత్పత్తులు ఆన్ లైన్  లో అందుబాటులో ఉన్నాయనీ,  త్వరలోనే ఓపెన్ మార్కెట్ లోకి తీసుకువస్తామని  రిలీఫ్ వెల్నెస్ సీఈవో తరుణ్ సింగ్ మచౌహాన్ తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...